1100జీబీ ఉచిత డేటా 100 ఎంబీపీఎస్ వేగంతో... జియో బ్రాడ్ బ్యాండ్ ఆఫర్
- ఎంపిక చేసిన కొన్ని పట్టణాల్లో పరీక్షలు
- త్వరలో దేశవ్యాప్తంగా వైర్డ్ బ్రాడ్ బ్యాండ్ సేవలు
- 10 కోట్ల కస్టమర్ల లక్ష్యం
ఇప్పుడు ఈ యూజర్లకు ప్రతీ నెలా ఉచితంగా 100జీబీ డేటాను 100 ఎంబీపీఎస్ వేగంతో అందించే ప్లాన్ తీసుకొచ్చింది. 100జీబీ ఉచిత డేటా పరిమితి దాటిన తర్వాత కస్టమర్లు 40జీబీ ఉచిత డేటాను టాప్ అప్ రూపంలో 25 సార్లు పొందొచ్చు. దీంతో మొత్తం 1100జీబీ అవుతుంది. అహ్మదాబాద్, చెన్నై, జామ్ నగర్, ముంబై, న్యూఢిల్లీ తదితర ప్రాంతాల్లో బ్రాడ్ బ్యాండ్ సేవలపై జియో పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇక్కడ రూ.4,500 వడ్డీ లేని హామీతో కూడిన డిపాజిట్ ను తీసుకుని బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ ఇచ్చింది. అయితే, ఈ ఏడాదే వైర్డ్ బ్రాడ్ బ్యాండ్ సేవలను దేశవ్యాప్తంగా ఆరంభించే ప్రణాళికతో ఉంది. 30 పట్టణాల్లో 10 కోట్ల మంది కస్టమర్లను సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో ఉంది.