కూకట్‌పల్లి ఎమ్మెల్యే కృష్ణారావుకు వ్యతిరేకంగా వీడియోలు పోస్టు చేసిన వ్యక్తి అరెస్ట్

  • ఎమ్మెల్యే పరువుకు భంగం వాటిల్లేలా 12 వీడియోలు పోస్టు
  • సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు
  • వీడియోలను తొలగించేందుకు రూ.10 లక్షల డిమాండ్
కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అసభ్యకర వీడియోలు పోస్టు చేసి, వాటిని తీసివేసేందుకు రూ.10 లక్షలు డిమాండ్ చేసిన కేపీహెచ్‌బీ మూడో ఫేజ్‌కు చెందిన పిడికిటి గోపాల్ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో మొత్తం 12 వీడియోలను పెట్టిన గోపాల్ వాటికి అసభ్యకరమైన కామెంట్లు రాశాడు.

 ఆ వీడియోలు, కామెంట్లు ఎమ్మెల్యే గౌరవానికి భంగం కలిగించేలా ఉండడంతో వాటిని  తొలగించాలని కృష్ణారావు అనుచరులు సూచించారు. నిరాకరించిన గోపాల్ చౌదరి రూ.10 లక్షలు ఇస్తేనే వాటిని తొలగిస్తానని తెగేసి చెప్పాడు. దీంతో సత్యప్రకాశ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎమ్మెల్యేను వ్యక్తిగతంగా కించపరిచేలా గోపాల్ వీడియోలు పోస్టు చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గోపాల్‌ను అదుపులోకి తీసుకున్నారు.  
Go Back to Shorts
Hyderabad
Kukatpally
Madhavaram krishna rao

More Telugu News