Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలుగు రాష్ట్రాల్లో 'నా పేరు సూర్య' స్పెషల్ షోలకు అనుమతి

  • బన్నీ హీరోగా 'నా పేరు సూర్య'
  • కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ 
  • మే 4వ తేదీన విడుదల         
వక్కంతం వంశీ దర్శకత్వంలో బన్నీ హీరోగా 'నా పేరు సూర్య' చిత్రం రూపొందింది. ఈ నెల 4వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ స్పెషల్ షోలు ఆంధ్రలో ఉంటాయా .. ఉండవా? అనే సందేహం అందరిలోనూ తలెత్తింది. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు స్పెషల్ షోల అనుమతిపై ప్రభావం చూపవచ్చని అనుకున్నారు.

అందువలన 'రంగస్థలం' .. 'భరత్ అనే నేను' సినిమాల స్పెషల్ షోలకి అనుమతి లభించినంత తేలికగా ఈ సినిమాకి రాకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ సినిమా స్పెషల్ షోలకి ఆంధ్రలోనే కాదు .. తెలంగాణలోను అనుమతి లభించింది. మే 4వ తేదీ నుంచి 11వ తారీకు వరకూ ఉదయం 5 గంటల నుంచి 10 గంటలలోపు అదనంగా ఒక షోను ప్రదర్శించనున్నారు. దేశభక్తి నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఇక ఏ స్థాయి వసూళ్లను సాధిస్తుందో చూడాలి.    
Allu Arjun
anu emmanuel

More Telugu News