ఫేస్ బుక్ లో కొత్త ఫీచర్... బ్రౌజింగ్ హిస్టరీ చెరిపేసుకునే అవకాశం
- ఈ ఫీచర్ పై ఫేస్ బుక్ వార్షిక సమావేశంలో చర్చ
- అందరి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత అమల్లోకి
- వెల్లడించిన ఫేస్ బుక్ చీఫ్ జుకెర్ బర్గ్
ఈ ఫీచర్ పై నేటి నుంచి మొదలయ్యే ఫేస్ బుక్ వార్షిక సమావేశంలో చర్చించనున్నట్టు ఆయన చెప్పారు. చూసిన వెబ్ సైట్లు, యాప్స్ సమాచారాన్ని అకౌంట్ నుంచి డిలీట్ చేసుకునేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుందన్నారు. బ్రౌజర్ లో కుకీస్ క్లియర్ కూడా చేసుకోవచ్చని చెప్పారు. ఈ విషయంలో నిపుణులు, విధాన కర్తలు, నియంత్రణ సంస్థల అభిప్రాయాలు తెలుసుకుని వచ్చే కొన్ని నెలల్లో అమల్లోకి తెస్తామని ప్రకటించారు.