హైదరాబాద్ సినిమా హాల్ లో అత్యాచారం చేసింది సిబ్బందే... రాజీయత్నాలు విఫలం!
- విజేత థియేటరులో ఘటన
- నీటి కోసం వెళితే అత్యాచారం
- ఫోక్సో చట్టం కింద కేసు
బాలిక ఎంతసేపటికీ ఇంటికి రాకపోయేసరికి థియేటరు మొత్తం వెతికి, ఆపై బాత్ రూములో చూడగా, అక్కడ స్పృహతప్పి పడివుంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా, కొందరు రాజకీయనాయకులు రంగంలోకి దిగి రాజీ ప్రయత్నాలు చేసినట్టు సమాచారం. ఈలోగా విషయం మీడియాకు పొక్కడంతో, అన్ని చానళ్లలో ఈ విషయం ప్రముఖంగా ప్రసారం కావడంతో, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు పెట్టామని, బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపామని పోలీసులు వెల్లడించారు.