లక్ష్య ఛేదనలో ఢిల్లీ ఢమాల్.. చెన్నై ఖాతాలో మరో విజయం

01-05-2018 Tue 09:05 | Sports
  • చివరి వరకు ఇరు జట్ల మధ్య దోబూచులాడిన విజయం
  • ఉత్కంఠ పోరులో చెన్నైదే విజయం
  • షేన్ వాట్సన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్
ఐపీఎల్‌లో భాగంగా పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ స్టేడియంలో ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 13 పరుగుల తేడాతో విజయం సాధించి తన ఖాతాలో మరో విజయాన్ని చేర్చుకుంది. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన ధోనీ సేన 6 విజయాలు, 12 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 211 పరుగుల చేసింది. ఓపెనర్ షేన్ వాట్సన్ మరోమారు చెలరేగిపోయాడు. 40 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 78 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ ఫా డుప్లెసిస్ 33 పరుగులు చేయగా, మూడో స్థానంలో బరిలోకి దిగిన అంబటి రాయుడు 41 పరుగులు చేశాడు. కెప్టెన్ ధోనీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 51 పరుగులు చేశాడు.

అనంతరం 212 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 198 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది. కెప్టెన్సీ చేపట్టిన తొలి మ్యాచ్‌లో రెచ్చిపోయి ఆడి జట్టుకు విజయాన్ని అందించిన శ్రేయాస్ అయ్యర్ ఈ మ్యాచ్‌లో 13 పరుగులకే పెవిలియన్ చేరాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ 45 బంతుల్లో 7  ఫోర్లు, 4 సిక్సర్లతో 79 పరుగులు చేసినా, జట్టును ఓటమి కోరల్లోంచి తప్పించలేకపోయాడు.

 విజయ్ శంకర్ 54 పరుగులు చేశాడు. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో చివరికి ధోనీ సేనదే పైచేయి అయింది. 78 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన చెన్నై ఓపెనర్ షేన్ వాట్సన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది. ఇక, ఈ మ్యాచ్‌లో ఢిల్లీ 6 పరాజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ఐపీఎల్‌లో భాగంగా నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి.
Chennai super kingsDelhi daredevilsIPLMS Dhoni

More Telugu News

భారత రైలులో ఫస్ట్ ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట!

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59
..more