చికిత్స పూర్తికాకుండానే నన్ను డిశ్చార్జ్ చేశారు: లాలూ ఫైర్
- బలవంతంగా డిశ్చార్జ్ చేశారు
- నా ఆరోగ్యాన్ని క్షీణింపజేసే కుట్రలు జరుగుతున్నాయి
- కుట్రలను ధైర్యంగా ఎదుర్కొంటా
మరోవైపు, లాలూ ఆరోగ్యం మెరుగుపడిందని, ప్రయాణం చేసే శక్తి ఆయనకు ఉందని ఎయిమ్స్ వైద్యులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆయనను రాంచీలోని రాంచీ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి రెఫర్ చేస్తున్నామని చెప్పారు. మెడికల్ బోర్డు సలహా మేరకు ఆయనను డిశ్చార్జ్ చేశామని తెలిపారు. ఈ డిశ్చార్జ్ వ్యవహారం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే ఆరోపణలను ఎయిమ్స్ వైద్యులు ఖండించారు.