14 యేళ్ల తరువాత దిల్ రాజు తో నితిన్
- షూటింగు దశలో 'శ్రీనివాస కల్యాణం'
- పంజాబ్ లోని పాటియాలలో చిత్రీకరణ
- కథానాయికగా రాశి ఖన్నా
కెరియర్ తొలినాళ్లలో నితిన్ 'దిల్' సినిమా చేశాడు. 'దిల్'ను నిర్మించిన కారణంగానే అది ఆ నిర్మాత ఇంటిపేరుగా మారిపోయింది. మళ్లీ ఇంతకాలానికి 'దిల్' రాజు నిర్మాణంలో నితిన్ ఈ సినిమా చేస్తున్నాడు. అంతేకాదు ఇంతకుముందు సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహించిన 'శతమానం భవతి' భారీ విజయాన్ని అందుకుంది. అందువలన ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి వుంది.