మరో భారీ ఎన్ కౌంటర్... గ్రేహౌండ్స్ దళాల చేతిలో ఆరుగురు మావోల మృతి
- మళ్లీ రక్తమోడిన సరిహద్దులు
- మావోల గురించి తెలుసుకుని గ్రేహౌండ్స్ మెరుపుదాడి
- కొనసాగుతున్న ఎన్ కౌంటర్
గ్రేహౌండ్స్ దళాళను చూసిన మావోలు తొలుత కాల్పులు ప్రారంభించగా, ఎన్ కౌంటర్ మొదలైనట్టు ప్రాథమిక సమాచారం. ఎన్ కౌంటర్ ఇంకా కొనసాగుతుండగా, ఆ ప్రాంతానికి మరిన్ని బలగాలను పంపించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సివుంది. కాగా, ఇటీవల జరిగిన వరుస ఎన్ కౌంటర్లలో 39 మంది మావోలు మరణించిన సంగతి తెలిసిందే.