క్రికెటైనా, సినిమా, సంగీతం ఏదైనాసరే...వారు మాత్రం వద్దే వద్దు!: గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు
- సైనికులను చంపుతుంటే పాక్ తో శాంతి చర్చలేంటి?
- అన్ని రంగాల్లో పాక్ ను నిషేధించండి
- పాకిస్థానీయులను కాలు పెట్టనీయవద్దు: గంభీర్
గత సంవత్సరం సుక్మా జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో వీరమరణం పొందిన సైనికుల పిల్లల విద్యకు అవసరమయ్యే ఖర్చును సాయంగా అందించిన గంభీర్, గత రాత్రి వారితో కలసి డిన్నర్ చేశాడు. పాక్ రేంజర్లను సైన్యం చంపడంలో తప్పు లేదని అభిప్రాయపడ్డ గంభీర్, సహనానికి కూడా హద్దు ఉంటుందని, శాంతి చర్చలని ఓ వైపు చెబుతూ, మరోవైపు సరిహద్దుల్లో దాష్టీకానికి దిగుతున్న పాక్ కు బుద్ధి చెప్పాలని అన్నాడు. ఈ అంశంలో రాజకీయాలకు తావివ్వరాదని సూచించాడు.