యూపీలో 13 మంది చిన్నారులను చిదిమేసిన రైలు!
- కాపలా లేని గేటు వద్ద ఘోర ప్రమాదం
- 13 మంది చిన్నారుల మృతి
- మరో ఏడుగురికి తీవ్ర గాయాలు
- అందరూ డివైన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులే
ఘటనను చూసిన ప్రత్యక్ష సాక్షులు మాట్లాడుతూ, దాదాపు 25 మందితో వెళుతున్న వ్యాన్ ను ఉదయం 6.45 - 7 గంటల మధ్య రైలు ఢీకొందని తెలిపారు. కాపలా లేని లెవల్ క్రాసింగ్ ఇదని అన్నారు. అందువల్లే దుర్ఘటన జరిగిందని, ఇక్కడ గేటు పెట్టాలని ఎప్పటి నుంచో వేడుకుంటున్నామని తెలిపారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, ఉన్నతాధికారులు సహాయక చర్యలను ప్రారంభించారు.
కాగా, సాధారణంగా ఈ రైలు ఉదయం 6 గంటలకే లెవల్ క్రాసింగ్ ప్రాంతాన్ని దాటి వెళ్లిపోతుంది. ఈ ఉదయం మాత్రం ఆలస్యమై 6.45 గంటల తరువాత వచ్చిందని తెలుస్తోంది.