కొత్త చిత్రం ‘జగన్ పవన్’ .. త్వరలో విడుదల!: గల్లా జయదేవ్ సెటైర్
వైసీపీ అధినేత జగన్, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ పై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ఓ పోస్ట్ చేశారు. కడుపుబ్బ నవ్విస్తున్న ఈ పోస్ట్ లో గల్లా జయదేవ్ చెబుతూ, ‘త్వరలో విడుదల కానున్న కొత్త చిత్రం.. ‘జగన్ పవన్’.. రచన, దర్శకత్వం ప్రశాంత్ కిషోర్ .. మోదీ - షా ప్రొడక్షన్స్ సమర్పణలో ఈ చిత్రం మీ ముందుకు రానుంది’ అని గల్లా జయదేవ్ ‘ఫేస్ బుక్’ పోస్ట్ చేశారు.
కాగా, గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో నిర్వహించిన ‘సైకిల్ యాత్ర’లో పాల్గొన్న ఆయన, కేంద్రం తీరుపై మండిపడ్డారు. రాష్ట్ర విభజన జరిగిన తీరుపై ఆయన విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం .. ఆంధ్రప్రదేశ్ కు అప్పులు ఇచ్చారని, ఉద్యోగులు, నీటి పంపకాల విషయంలో స్పష్టత లేదని మండిపడ్డ గల్లా, ఏపీకి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.