Kangana Ranaut: దర్శకులను సూపర్‌స్టార్లు తొక్కేస్తున్నారు: కంగనా రనౌత్ తీవ్ర వ్యాఖ్యలు
వివాదాస్పద అంశాలపై కూడా సూటిగా, స్పష్టంగా తన అభిప్రాయాలను వెల్లడించే నటి, రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతీయ సినీ పరిశ్రమలో సూపర్‌స్టార్లు ఫిల్మ్‌మేకర్లను వేధిస్తారని, వారిని బెదిరింపులకు గురిచేస్తారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. తన తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో ఈ విషయంపై ఆమె గళం విప్పారు. హాలీవుడ్‌లో ప్రముఖ నటుల కంటే దర్శకులకే ఎక్కువ పేరు, గౌరవం ఉంటాయని, కానీ బాలీవుడ్‌లో పరిస్థితి దానికి పూర్తి భిన్నంగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల ఘన విజయం సాధించిన 'ధురంధర్ 2' చిత్రం సందర్భంగా దర్శకుడు ఆదిత్య ధర్‌ను ప్రశంసిస్తూ కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక సుదీర్ఘమైన నోట్ రాశారు. భారతీయ చిత్ర పరిశ్రమలో దర్శకులు, ఇతర సాంకేతిక నిపుణులు తీవ్రమైన శ్రమకు గురవుతారని, కానీ వారికి సరైన పారితోషికం గానీ, గుర్తింపు గానీ లభించడం లేదని ఆమె పేర్కొన్నారు. "ధురంధర్ విజయంలో గొప్ప విషయం ఏమిటంటే, ఆదిత్య ధర్ ఒక సూపర్‌స్టార్ డైరెక్టర్‌గా స్థిరపడటం. స్పీల్‌బర్గ్, టరంటినో, నోలన్ వంటి హాలీవుడ్ సూపర్‌స్టార్ దర్శకులకు ఎప్పుడూ అక్కడి నటుల కన్నా అధిక ప్రాధాన్యత ఉంటుంది. కానీ మనం మన ఫిల్మ్‌మేకర్లకు తగినంత గౌరవం ఇవ్వం" అని కంగనా వ్యాఖ్యానించారు.
"దర్శకులు అధిక శ్రమకు గురవుతూ, తక్కువ వేతనం పొందుతూ సూపర్‌స్టార్ల చేతిలో వేధింపులకు గురవుతున్నారు. దీని ఫలితంగానే, ఫిల్మ్‌మేకర్ కావాలని లేదా సినిమాటోగ్రాఫర్ అవ్వాలని కలలు కనే యువతను నేను ఎప్పుడూ కలవలేదు. ప్రతి ఒక్కరూ తమకు టాలెంట్ ఉందని చెప్పుకుంటారు, కానీ అందరూ నటులు కావాలనే కోరుకుంటారు. ఇక్కడ ఏ హీరో కన్నా ప్రకాశవంతంగా వెలిగిపోతున్న ఒక సూపర్‌స్టార్ ఫిల్మ్‌మేకర్ (ఆదిత్య ధర్) ఉన్నారు. ఇప్పుడు ఎందరో యువకులు ఆయన కథను చూసి, ఆయనలాగే ఎదగాలని ఆకాంక్షిస్తారు. సినీ పరిశ్రమను ఉన్నత శిఖరాలకు తీసుకెళతారు. ఆదిత్య ధర్... మీకు నా వందనాలు" అని కంగనా తన పోస్టులో రాసుకొచ్చారు.
ఈ పోస్టులో దర్శకుడు ఆదిత్య ధర్‌పై ప్రశంసల వర్షం కురిపించిన కంగనా, చిత్ర కథానాయకుడు రణ్‌వీర్ సింగ్‌ను గానీ, ఇతర నటీనటులను గానీ ట్యాగ్ చేయకపోవడం గమనార్హం.