Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీజర్ చూశాక దిమ్మ తిరిగిపోయింది: రాజమౌళి

  • బాలీవుడ్‌ సినిమా ‘సంజు’ టీజర్‌ నిన్న విడుదల
  • రణ్‌బీర్‌ చాలా బాగా నటించాడన్న జక్కన్న
  • రాజ్‌కుమార్‌ హిరాణీ ఓ మాస్టర్ అని ప్రశంస
బాలీవుడ్‌ సినిమా ‘సంజు’ టీజర్‌పై దర్శకధీరుడు రాజమౌళి ప్రశంసలు కురిపించారు. బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా తీస్తోన్న ఈ సినిమాలో ఆయన పాత్రలో రణ్ బీర్ కపూర్ నటించాడు. 'కిటికీలోంచి ప్రపంచం మొత్తాన్ని చూశాను... కిటికీయే లేని గదుల్లోనూ ఉన్నాను' అంటూ రణ్‌ బీర్‌ చెబుతోన్న డైలాగులు ఆకట్టుకున్నాయి. రాజమౌళి దీనిపై ట్విట్టర్‌ ద్వారా స్పందిస్తూ... ‘టీజర్ చూశాక దిమ్మ తిరిగిపోయింది. రణ్‌బీర్‌.. చాలా బాగా నటించావు. రాజ్‌కుమార్‌ హిరాణీ ఓ మాస్టర్’ అని పేర్కొన్నారు. ఈ సినిమా ఈ ఏడాది జూన్‌ 29న విడుదల కానుంది.
Rajamouli
sanju
Bollywood

More Telugu News