బస్ టికెట్ కోసం రోడ్డు మీద భిక్షమెత్తాను... ఆకట్టుకుంటున్న సంజయ్ దత్ బయోపిక్ టీజర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బస్ టికెట్ కోసం రోడ్డు మీద భిక్షమెత్తాను... ఆకట్టుకుంటున్న సంజయ్ దత్ బయోపిక్ టీజర్

  • ఉన్నత శిఖరాలు అధిరోహించాను
  • అగాధంలో కూరుకుపోయాను
  • 'సంజు' టీజర్ విడుదల 
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జీవితం ఆధారంగా రూపొందుతున్న బయోపిక్ 'సంజూ' సినిమా టీజర్‌ ను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. టీజర్ సినీ అభిమానులను అలరిస్తోంది. "కొత్తగా చెప్పడానికి ఏముంది? నా జీవితం తెరిచిన పుస్తకం..ఇందులో శిఖరాలు, అగాధాలు చవిచూశాను. లంగ్స్ పాడయ్యేలా డ్రగ్స్ తీసుకున్నాను..డాక్టర్ కూడా బతికించలేమన్నాడు... కానీ మహ్మదాలీకి పోటీగా బాడీని పెంచాను. చార్టర్డ్ ఫ్లైట్ ఎక్కాను.. బస్ టికెట్ కోసం నడిరోడ్డు మీద భిక్షమెత్తాను..కిటికీలోంచి ప్రపంచం మొత్తాన్ని చూశాను... కిటికీయే లేని గదుల్లోనూ ఉన్నాను" అంటూ సంజయ్ దత్ పాత్ర ధారి రణ్ బీర్ కపూర్ చెబుతున్న డైలాగులు ఆకట్టుకున్నాయి.

రణ్ బీర్ కపూర్ టైటిల్ రోల్ కు ప్రాణం పోశాడని టీజర్ చూస్తే తెలుస్తోంది. ఈ సినిమాలో ఇంకా పరేశ్ రావల్, మనీషా కోయిరాలా, అనుష్క శర్మ, సోనమ్ కపూర్, దియా మీర్జా, విక్కీ కౌశల్, జిమ్ సార్బా, బోమన్ ఇరానీ తదితరులు నటిస్తున్నారు. 
sanjuy dutt
sanju
ranbir kapoor
Bollywood

More Telugu News