రౌడీషీటర్ కళ్లల్లో కారం చల్లి హత్య చేసిన దుండగులు!
- పరికి బస్తీలో జరిగిన సంఘటన
- రౌడీషీటర్ ను కత్తులతో విచక్షణా రహితంగా పొడిచిన వైనం
- నిందితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతని మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, ఇద్దరు మహిళలతో పాటు మరో నలుగురు ఫరీద్ పై దాడి చేసినట్టు స్థానికులు చెప్పారని అన్నారు. నిందితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. కాగా, రౌడీషీటర్ ఫరీద్ పై చిలకలగూడ పోలీస్ స్టేషన్ లో పలు కేసులు నమోదై ఉన్నాయి.