బాలయ్య తప్పేం మాట్లాడలేదు.. ఢిల్లీ పెద్దలు అర్థం చేసుకోవడం లేదు: వర్ల రామయ్య
- బాలయ్య మాట్లాడిన దానిలో అసత్యాలు లేవు
- బాలయ్యపై కాదు.. దమ్ముంటే 5 కోట్ల ఆంధ్రులపై కేసులు పెట్టండి
- చంద్రబాబు దీక్షకు ప్రత్యక్షంగా 80వేల మంది మద్దతు పలికారు
బాలయ్యపై బీజేపీ నేతలు కేసులు పెడుతున్నారని... వారికి దమ్ముంటే 5 కోట్ల ఆంధ్రులపై కేసులు పెట్టాలని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి చేపట్టిన దీక్షకు ప్రత్యక్షంగా 80 వేల మంది ప్రజలు వచ్చి మద్దతు ప్రకటించారని... కేంద్రం తీరుపై ప్రజలు ఎంత ఆగ్రహంగా ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతుందని అన్నారు. విజయవాడలోని ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు.