ప్రజలపై పన్ను బాదుడు వల్లే పెట్రో ధరల మంట: మోదీ సర్కారుపై చిదంబరం విమర్శలు
- నాలుగేళ్ల క్రితం చమురు బ్యారెల్ 105 డాలర్లు, ఇప్పుడు 74 డాలర్లే
- అయినా నాటి కంటే నేడే ధరలు ఎక్కువన్న చిదంబరం
- పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురాకపోవడంపై విమర్శ
అయినప్పటికీ నాలుగేళ్ల క్రితం నాటి ధరల కంటే ఇప్పుడే డీజిల్, పెట్రోల్ ధరలు ఎందుకు అధికంగా ఉన్నాయని ఆయన ప్రశ్నించారు. గత నాలుగేళ్లుగా మోదీ సర్కారు ఆయిల్ బొనాంజా (తక్కువ ధరలు ఉండడం) అనుభవించిందన్నారు. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురాకపోవడాన్ని విమర్శించారు.