కిడ్నాప్ చేసిన తెలుగు ఇంజినీర్‌ను హత్య చేసిన మావోలు!
- రెండు రోజుల క్రితం ఇంజినీర్ కిడ్నాప్
- అత్యంత దారుణంగా హత్య చేసి పడేసిన మావోలు
- తూర్పుగోదావరి జిల్లాలో విషాదం
తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం బాణాపురం గ్రామానికి చెందిన బాలనాగేశ్వరరావు (60)ను రోడ్డు పనులను పర్యవేక్షిస్తుండగా మావోలు కిడ్నాప్ చేశారు. సోమవారం ఉదయం చత్తీస్‌గఢ్ రాష్ట్రం కిష్టారం-కాచారం అటవీ గ్రామాల మధ్య రోడ్డు పక్కన ఆయన మృతదేహం కనిపించింది. బాలనాగేశ్వరరావు మృతి విషయం తెలిసి అతడి స్వగ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.