చంద్రబాబుని బకాసురుడితో పోల్చవచ్చు: విజయసాయిరెడ్డి

  • చంద్రబాబు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు
  • ఏపీకి ప్రత్యేక హోదా సంజీవని
  • హోదా వచ్చేంత వరకూ పోరాటాన్ని కొనసాగిస్తాం
  • చంద్రబాబు ఏపీ భవిష్యత్తును తాకట్టు పెట్టారు
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుని బకాసురుడితో పోల్చవచ్చని, ఆయన రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ ఈ రోజు ఏపీలో బంద్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. బంద్‌లో పాల్గొన్న విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ఏపీకి ప్రత్యేక హోదా సంజీవని అని, అది వచ్చేంత వరకూ తమ పోరాటాన్ని కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. చంద్రబాబు నాయుడు స్వప్రయోజనాల కోసం ఏపీ భవిష్యత్తును తాకట్టు పెట్టారని ఆరోపించారు. ప్రత్యేక హోదా ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉందని, ఆ విషయం నేడు నిర్వహించిన బంద్‌ విజయవంతం కావడంతో స్పష్టమైందని అన్నారు.  బంద్‌కు మద్దతు తెలిపిన ఏపీ పార్టీల నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.
Go Back to Shorts
Vijay Sai Reddy
YSRCP
Chandrababu

More Telugu News