అమ్మతో బుజ్జి తారక్‌.. ఫొటో వైరల్

  • పోస్ట్ చేసిన అభిమానులు
  • తన తల్లి శాలిని పక్కన జూ.ఎన్టీఆర్‌
  • అమాయకంగా కనపడుతోన్న తారక్
ఆది, సింహాద్రి, అదుర్స్‌, బృందావనం, జనతా గ్యారేజ్‌, నాన్నకు ప్రేమతో వంటి సినిమాలతో భారీ హిట్‌లు అందుకుని టాలీవుడ్‌ అగ్ర హీరోల్లో ఒకరిగా వెలుగొందుతోన్న జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే.

తాజాగా ఆయన చిన్నప్పటి ఫొటో ఒకటి బయటకు వచ్చింది. తన తల్లి శాలిని పక్కన నోట్లో వేలు పెట్టుకుని అమాయకంగా నిల్చొని ఉన్నాడు. ఈ ఫొటోను ఎన్టీఆర్‌ అభిమానులు పోస్ట్ చేయగా తెగ వైరల్‌ అవుతోంది. ఇటీవలే తారక్‌ లవకుశ సినిమాలో తన నట విశ్వరూపాన్ని చూపాడు. త్రివిక్రమ్‌తో సినిమా తరువాత దర్శకుడు రాజమౌళి తీయనున్న మల్టీస్టారర్‌ సినిమాలో తారక్‌ నటించనున్నాడు.
Go Back to Shorts
jr ntr
Twitter
viral photo

More Telugu News