హైదరాబాద్ లో భారీ బందోబస్తు... ఎక్కడ చూసినా పోలీసులే!
- మక్కా పేలుళ్ల కేసులో తుది తీర్పు
- నిందితులంతా నిర్దోషులేనన్న ఎన్ఐఏ కోర్టు
- మరిన్ని బలగాలను రంగంలోకి దించిన పోలీసులు
- అనుమానితుల తనిఖీ
ఈ కేసులో సాక్ష్యాలు లేవంటూ నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించింది కోర్టు. దీంతో పాతబస్తీలో అల్లర్లు జరగవచ్చన్న ఆందోళన నెలకొనగా, పలు చౌరస్తాల్లో మోహరించిన పోలీసులు, అనుమానితులను తనిఖీలు చేస్తున్నారు. ఈ కేసులో తీర్పు వెలువడిన నేపథ్యంలో ఐదుగురు నిందితులు ఎన్ఐఏ కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో తీర్పు అనుకూలంగా రావడం పట్ల వారంతా ఆనందాన్ని వ్యక్తం చేశారు.