నైట్ క్లబ్ ను ప్రారంభించిన ఉన్నావో ఎంపీ... మరిన్ని రేప్ ల కోసమా? అంటూ విమర్శల వెల్లువ!
- ఉన్నావో ఎమ్మెల్యేపై అత్యాచార ఆరోపణలు
- నైట్ క్లబ్ ప్రారంభించిన ఉన్నావో ఎంపీ సాక్షీ మహరాజ్
- నిప్పులు చెరుగుతున్న విపక్షాలు, ప్రజలు
రాష్ట్రంలో మరింతగా అత్యాచారాలు పెరగాలన్నదే ఆయన ఉద్దేశమా? అని అడుగుతున్నారు. కాగా, గతంలో తన వివాదాస్పద వ్యాఖ్యలతో సాక్షీ మహారాజ్ పలుమార్లు వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితం ఆయన యువతీ యువకుల అసభ్య ప్రవర్తనే రేప్ లకు కారణమని, చుట్టూ ఉన్న ప్రజలు చూస్తున్నారన్న సంగతిని కూడా మరచిపోయే యువతీ యువకులను జైళ్లలో పెట్టాలని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మోటార్ సైకిళ్లపై కౌగిలించుకుని వెళుతుండే అమ్మాయి, అబ్బాయిలు చూసే వారికి ఇబ్బందులు కలిగిస్తున్నారని, పార్కుల్లో, కార్లలో వారి సరసాలు శ్రుతిమించుతున్నాయని కూడా సాక్షీ మహారాజ్ అన్నారు.