'అసిఫా'కు న్యాయం చేయాలంటూ మెహ్రీన్ ట్వీట్.. దేశం వదిలి వెళ్లిపొమ్మన్న నెటిజన్
- 8 ఏళ్ల బాలిక హత్యాచారంపై స్పందించిన మెహరీన్
- ఆమెపై మండిపడిన నెటిజన్
- ఘాటు సమాధానమిచ్చిన మెహరీన్
దీనిపై ఒక నెటిజన్ మండిపడుతూ, ‘హిందుస్థానీగా ఉండటం నీకు అంత సిగ్గుగా అనిపిస్తే దేశాన్ని విడిచి వెళ్లిపో. హిందుస్థానీయులుగా ఉన్నందుకు మేం చాలా గర్విస్తున్నాం. పిల్లలపై ఇలాంటి దారుణాలు అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా జరుగుతున్నాయి. వాళ్లు ఎప్పుడూ ఇలా ఓవర్ యాక్షన్ చేయలేదు’ అంటూ సమాధానం ఇచ్చాడు. దీంతో ఒళ్లు మండిన మెహరీన్ ప్రతిస్పందిస్తూ, ‘నీలాంటి వారి కోసమే ఈ పోస్ట్ చేశా’ అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది. దీనికి ఆమె అభిమానులు, నెటిజన్లు ‘సరిగ్గా చెప్పావ్, మీకు మద్దతు ఇస్తున్నాం, అంటూ ఆమెను ప్రోత్సహిస్తూ, అలాంటి వారిని పట్టించుకోవద్దని సలహా ఇచ్చారు.