తారక్ కు ఫోన్ చేస్తే... జోక్ చేస్తున్నావా? అని అడిగారు: కొరటాల శివ

  • 'భరత్ అనే నేను' ప్రమోషన్ కార్యక్రమాల్లో కొరటాల
  • తారక్ ను పిలవాలని చెప్పింది మహేషే
  • ఆయన రావడం ఫంక్షన్ కు ప్లస్ పాయింట్
ఈ వారంలో విడుదలకు సిద్ధమైన మహేష్ బాబు తాజా చిత్రం 'భరత్ అనే నేను' ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న దర్శకుడు కొరటాల శివ, ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ, చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముందు జరిగిన ఓ ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. సినిమా ఫంక్షన్ హైదరాబాద్ లో చేయాలని అనుకున్న తరువాత, "సంవత్సరం మొత్తం మన ఫేస్ లే చూసుకున్నాం. సినిమా ఫంక్షన్ కు ఎవరైనా గెస్ట్ ఉంటే బాగుంటుంది కదా?" అని మహేష్ చెప్పగా, ఎవరిని పిలవాలని ఆలోచిస్తున్న సమయంలో ఆయనే తారక్ ను పిలుద్దామా? అని అడిగారని చెప్పారు. తాను వెంటనే ఫంక్షన్ గురించి చెప్పి, తారక్ ను ఆహ్వానిస్తే, "ఊరుకోండి... జోక్ చేస్తున్నారా?" అని అన్నాడని, నిజంగా రావాలని కోరితే, అంగీకరించి, రెండు గంటల పాటు తాను కూడా ఎంజాయ్ చేస్తానని చెప్పాడని అన్నారు. ఎన్టీఆర్ రావడం తమ ఫంక్షన్ కు ప్లస్ పాయింట్ అయిందని చెప్పారు.
Go Back to Shorts
NTR
Tarak
Mahesh Babu
Bharath Ane Nenu
Koratala Siva

More Telugu News