అప్పుడు ఫోన్ బిల్ చూసి శ్రీహరి షాక్ అయ్యాడు!: డిస్కోశాంతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అప్పుడు ఫోన్ బిల్ చూసి శ్రీహరి షాక్ అయ్యాడు!: డిస్కోశాంతి

  • మొదట్లో నాకు వంట చేయడం రాదు 
  • ఫోన్లో మా అమ్మని అడుగుతూ చేసే దానిని
  • ఆయన హోటల్ నుంచి తెప్పించుకుంటాను అన్నారు    
ఒకప్పుడు తెలుగు తెరపై సందడి చేసిన డిస్కోశాంతి .. శ్రీహరితో వివాహమయ్యాక సినిమాలను పక్కన పెట్టేశారు. శ్రీహరి చనిపోయిన తరువాత ఆమె ఆ షాక్ నుంచి కోలుకోవడానికి చాలా కాలం పట్టింది. తాజాగా ఆమె ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ ఒక సంఘటనను గురించి ప్రస్తావించారు.

" పెళ్లికి ముందు నాకు పప్పు .. అరటికాయ కూర .. ఆలూ కూర చేయడం మాత్రమే వచ్చు. పెళ్లయిన తరువాత చెన్నైలో వున్న మా అమ్మకి ఫోన్ చేసి .. అది ఎలా చేయాలి .. ఇది ఎలా చేయాలి అని అడుగుతూనే చేసే దానిని. అలా చెన్నైలోని మా అమ్మకి ప్రతి రోజూ ఫోన్ చేస్తూ .. వంట చేసేదానిని. అలా 6 నెలల పాటు వంట చేశాను. అది ల్యాండ్ లైన్ కావడంతో 6 నెలలకి రెండు లక్షల ఎనభై అయిదు వేల ఫోన్ బిల్ వచ్చింది. అది చూసి శ్రీహరి షాక్ అయ్యారు. ఇక నువ్వేం వంట చేయకు .. నేను హోటల్ నుంచి తెప్పించుకుని తింటాను .. రోజూ తెప్పించుకున్నా ఈ బిల్లులో సగం కూడా కాదు " అన్నారు అంటూ నవ్వేసింది. 
disco shanthi

More Telugu News