Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ రియాక్షన్స్ ను మర్చిపోలేను : హీరో రామ్ చరణ్

  • ‘రంగస్థలం’ చూసిన తర్వాత  మా మమ్మీడాడీ రియాక్షన్స్ మర్చిపోలేను
  • ‘చాలా బాగుంది’ అని అమ్మ చెప్పింది
  • జనాల మధ్య కూర్చుని ‘రంగస్థలం’ చూడాలని బాబాయ్ అడిగారు
రంగస్థలం వంటి మంచి సినిమాను ఇచ్చిన దర్శకుడు సుకుమార్ ని మర్చిపోలేనని ఆ చిత్రం విజయోత్సవ వేడుకలో హీరో రామ్ చరణ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘ఈ సినిమా చూసిన తర్వాత మా మమ్మీడాడీ ఇచ్చిన రియాక్షన్ మర్చిపోలేను. సినిమా చూడడం అయ్యాక మా అమ్మకు మాటలు రాలేదు. చాలా భారంగా కళ్లలో నీళ్లతో ఉన్న మా అమ్మ నా చేయి పట్టుకుని ఆమె పక్కన కూర్చోబెట్టుకుంది. ‘చాలా బాగుంది’ అని చెప్పింది.

 ఈ  సీన్ బాగుంది.. ఆ సీన్ బాగుంది అని కాకుండా చెప్పిన ఆ ఒక్క మాట నేను మర్చిపోలేను. కల్యాణ్ బాబాయ్ సినిమా చూడలేదని చెప్పి, వాళ్ల ఇంటికి వెళ్లి సినిమా చూడమని చెబుదామనుకుంటుంటే.. బాబాయే నాకు ఫోన్ చేశారు. ‘ఇంటికి రారా’ అని అన్నారు. అప్పటికి ఆయన ఇంకా సినిమా చూడలేదు. రంగస్థలంలో చాలా బాగా చేశావని చెబుతున్నారని ప్రశంసించారు.

‘మీ ఇంట్లో ఈ సినిమా వేయిస్తాను బాబాయి’ అని చెప్పాను. ‘ఇంట్లో వద్దు..ఇంకెక్కడైనా చూడాలని ఉంది’ అన్నారు. ‘ప్రివ్యూ థియేటర్ లో చూద్దాం’ అని చెప్పాను. ‘ఎక్కడైనా జనాలతో కలిసి సినిమా చూడాలని ఉంది’ అని బాబాయ్ అన్నారు. ఆయన అలా అడగడం నేను మర్చిపోలేకపోతున్నా.. ఈ రియాక్షన్స్ నేను మర్చిపోలేను’ అని అన్నాడు. 
Ramcharan
ranghasthalam

More Telugu News