Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రభుదేవా అదరగొట్టేశాడంటోన్న 'మెర్క్యురీ' ఆడియన్స్

  • అంధుడిగా ప్రభుదేవా 
  • దెయ్యంగా అద్భుతమైన నటన 
  • ప్రేక్షకుల నుంచి ప్రశంసలు
సస్పెన్స్  థ్రిల్లర్ సినిమాలను తెరకెక్కించడంలో దర్శకుడిగా తనకి తానే సాటి అనే విషయాన్ని 'పిజ్జా' చిత్రంతో కార్తీక్ సుబ్బరాజ్ నిరూపించుకున్నాడు. అలాంటి కార్తీక్ సుబ్బరాజ్ ఈ సారి సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలోనే డిఫరెంట్ కంటెంట్ ను ఎంచుకుని, 'మెర్క్యురీ' టైటిల్ తో ఓ చిత్రాన్ని ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఈ సినిమా చూసిన వాళ్లంతా ప్రభుదేవా నటన అద్భుతం అనేస్తున్నారు.  

తన బాడీ లాంగ్వేజ్ ను పూర్తిగా మార్చుకుని, దెయ్యం పాత్రలో ఆయన అదరగొట్టేశాడని చెబుతున్నారు. అసాధారణమైన తన నటనతో ప్రభుదేవా సెకండాఫ్ ను నిలబెట్టేశాడని అంటున్నారు. ఒక వైపున అంధుడిగా .. మరో వైపున దెయ్యంగా ప్రతీకారం తీర్చుకునే పాత్రలో ప్రభుదేవా జీవించాడని అంటున్నారు. భయాన్ని కలిగించే రూపంతో .. బాధను కలిగించే హావభావాలతో నటుడిగా ప్రభుదేవా నూటికి నూరు మార్కులు సంపాదించుకున్నాడని చెబుతున్నారు.       
prabhudeva
induja

More Telugu News