మెగాహీరో మూవీ టైటిల్ ను అందుకే వద్దనుకున్నారట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మెగాహీరో మూవీ టైటిల్ ను అందుకే వద్దనుకున్నారట!

  • కరుణాకరన్ తో సాయిధరమ్ తేజ్ 
  • కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ 
  • ఈ కారణంగానే టైటిల్ మార్పు    
ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా కరుణాకరన్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ షూటింగును పూర్తిచేసుకుంది. ఈ సినిమాకి 'అందమైన చందమామ' అనే టైటిల్ ను పరిశీలించారు. ఆ తరువాత ఆ టైటిల్ ను పక్కన పెట్టేసి 'తేజు ది కూడా ఒక మంచి ప్రేమకథ' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా వార్తలు వచ్చాయి.

'అందమైన చందమామ' అనే టైటిల్ ను పెడితే .. కథానాయిక ప్రాముఖ్యత కలిగిన కథ అనే సంకేతాలు వెళతాయనే ఉద్దేశంతో, ఆ టైటిల్ ను పక్కన పెట్టేశారట. హీరో వైపు నుంచే టైటిల్ ఉండాలనే అభిప్రాయాన్ని నిర్మాతలు వ్యక్తం చేయగా కరుణాకరన్ 'తేజు ది కూడా ఒక మంచి ప్రేమకథ' అనే టైటిల్ ను అనుకున్నట్టు చెబుతున్నారు. 'ఇది తేజు ప్రేమకథ' అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉండటం విశేషం.     
sai dharam tej
anupama

More Telugu News