యాభై ఏళ్లలో జరగని అభివృద్ధిని నాలుగేళ్లలో మోదీ చేసి చూపించారు : బండారు దత్తాత్రేయ
- ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు
- మచ్చ లేని నాయకుడు మోదీ
- చంద్రబాబు, కేసీఆర్ లవి వారసత్వ రాజకీయాలు
మహిళల కోసం‘బేటీ బచావో బేటీ పడావో’, ముందు చూపుతో ‘స్వచ్ఛభారత్’ వంటివి తీసుకొచ్చిన ఘనత మోదీది అని అన్నారు. దేశ ప్రజలే మోదీ వారసులని చెప్పిన ఆయన, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో తన కుమారుడిని రాజకీయ వారసుడిగా తీసుకొస్తున్నారని, ఏపీలోనూ చంద్రబాబు వారసత్వ రాజకీయాలు నడుపుతున్నారని విమర్శలు గుప్పించారు.