బీజేపీ నేతలపై చెప్పులతో దాడి చేసిన సీపీఐ కార్యకర్తలు... విజయవాడ రణరంగం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేసిన బీజేపీ, ఇప్పుడిలా దీక్షలు చేయడం ఏంటని విజయవాడ ధర్నాచౌక్ లో నిరసన తెలుపుతున్న బీజేపీ నేతలను ప్రశ్నించేందుకు సీపీఐ నేతలు వచ్చిన వేళ, తీవ్ర రభస జరుగగా, ఆ ప్రాంతమంతా రణరంగంగా మారింది.

సీపీఐ నేతలను బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో తొలుత వాగ్వాదంతో ప్రారంభమైన గొడవ, ఆపై తోపులాటల వరకు వెళ్లింది. ఈ సందర్భంగా బీజేపీ నేతలపై సీపీఐ కార్యకర్తలు చెప్పులతో దాడి చేశారు. ఏపీ ప్రజలను మోసం చేసి నిరసన ఎలా చేస్తారంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావును సీపీఐ నేతలు నిలదీశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారగా, పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. సీపీఐ కార్యకర్తలను అక్కడి నుంచి తరిమేసిన పోలీసులు, బీజేపీ దీక్షాస్థలి వద్ద భారీ ఎత్తున బలగాలను మోహరించారు.


More Telugu News