విలనిజం అంటే ఇష్టం .. వాళ్ల నీడలో నిలబడే చోటు దొరికినా చాలు: నటుడు అజయ్ ఘోష్
- విలన్ పాత్రలు చేయడం ఇష్టం
- ఆ తరహా వ్యక్తులను పరిశీలిస్తాను
- అవకాశం వచ్చినప్పుడు స్ఫూర్తిని పొందుతాను
" నాకు విలన్ పాత్రలు చేయడం ఇష్టం .. విలనిజంలోను ఎన్నో విభిన్నమైన లక్షణాలు ఉంటాయి. అందువల్లనే సమాజంలోని వివిధ రకాల మనుషులను చాలా దగ్గరగా పరిశీలిస్తూ వుంటాను. ఆయా వ్యక్తులు .. వాళ్ల చిత్రమైన ధోరణి నుంచి విలన్ గా నా నటనకి కావలసిన కంటెంట్ ను తీసుకుంటాను. విలన్ పాత్రలకి సంబంధించి నేను స్ఫూర్తిని పొందడానికి ఎస్వీఆర్ నుంచి కోట శ్రీనివాసరావు గారు వరకూ కారకులే. అలాంటి మహానటుల నీడలో నిలబడే చోటు దొరికినా చాలనేది నా కోరిక" అంటూ చెప్పుకొచ్చారు.