అల్లుడిని ఆసుపత్రి పాలు, మామను జైలు పాలు చేసిన టీవీ చానల్ వివాదం!
- భోజనానంతరం ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్న అల్లుడు వెంకటి
- సీరియల్ చూడాలంటూ చానల్ మార్చిన మామ బుజ్జయ్య
- ఘర్షణగా మారిన వాగ్వాదం
ఇది వాగ్వాదానికి దారితీసింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బుజ్జయ్య కత్తెరతో అల్లుడిపై దాడి చేశాడు. కత్తెర లోతుగా గుచ్చుకోవడంతో వెంకటికి తీవ్ర రక్తస్రావం జరిగి, అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో అతనిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారి సూచనతో నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో అక్కడి నుంచి హైదరాబాదు నిమ్స్ కు తరలించారు. వెంకటి భార్య అక్షిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, బుజ్జయ్యను అదుపులోకి తీసుకున్నారు.