ఓ బాలిక కోసం ప్రముఖ బాయ్స్ స్కూల్ తొలిసారి రూల్స్ బ్రేక్ చేసింది!
- అటెండెన్స్ చాలకపోవడంతో షకీనా ముఖియాను ప్రమోట్ చేసేందుకు నిరాకరించిన సెయింట్ థామస్ స్కూల్
- కల్నల్ బ్రౌన్ కేంబ్రిడ్జ్ బాయ్స్ స్కూల్ లో షకీనా ముఖియాకు అడ్మిషన్
- ‘వాయిస్ ఇండియా కిడ్స్’ రియాలిటీ సింగింగ్ కాంపిటీషన్ ద్వారా సుపరిచితురాలైన షకీనా
తాను స్కూల్ కి హాజరుకానంత మాత్రాన చదవడం ఆపలేదనేది షకీనా వాదన. అయితే ఆమె ఎంత చురుకైన విద్యార్థి అయినప్పటికీ నిబంధనలను అతిక్రమించలేమని, ఆమె మళ్లీ అదే తరగతి చదవాల్సిందేనని యాజమాన్యం చెబుతోంది. దీంతో షకీనా తల్లిదండ్రులు కల్నల్ బ్రౌన్ కేంబ్రిడ్జ్ స్కూల్ యాజమాన్యాన్ని సంప్రదించారు. వారు సుదీర్ఘంగా ఉన్న ‘ఓన్లీ బాయ్స్’ నిబంధనను పక్కకు పెట్టి షకీనాకు ప్రవేశపరీక్ష పెట్టారు. ఇందులో పాస్ కావడంతో ఆమెకు సీట్ ఖరారు చేశారు. అబ్బాయిలు ధరించిన యూనిఫామ్ ధరించాల్సి ఉంటుందని స్కూలు తెలిపింది.