రాందేవ్ బాబాతో కలిసి ‘యోగా’ చేసిన ఎంపీ కవిత!
- నిజామాబాద్ లో ఉచిత యోగ చికిత్స, ధ్యాన శిబిరం
- రాందేవ్ తో కలిసి ఆసనాలు వేసిన కవిత, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు,
- భారీ సంఖ్యలో హాజరైన ప్రజలు
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, ‘ఇంత మంచి కార్యక్రమం జరగడం సంతోషం. మన మనసులో ఉండేటటువంటి శాంతిని మనం ముందుగా తెలుసుకుని, దానిని బయట ప్రపంచానికి తెలియజేస్తే విశ్వశాంతి అవుతుంది. అంతకుమించి ఇంకోటి లేదు. మనల్ని మనకు పరిచయం చేసేటటువంటి ఈ అద్భుత కార్యక్రమానికి బాబా రాందేవ్ గారు శ్రీకారం చుట్టి, ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు’ అన్నారు.
ఈ సందర్భంగా రాందేవ్ బాబా మాట్లాడుతూ, పతంజలి ఉత్పత్తుల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయంతో, ఇలాంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, తెలంగాణతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, పసుపు బోర్డు ఏర్పాటుకు తన మద్దతు ఉంటుందని అన్నారు.