'సైరా'లో మెరవనున్న తమన్నా?
- 'క్వీన్' రీమేక్ లో తమన్నా
- సెట్స్ పై 'నా నువ్వే'
- 'సైరా'లో చేసే ఛాన్స్
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా' సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రకి గాను తమన్నా అయితే బాగుంటుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. అందుకు సంబంధించిన సంప్రదింపులు కూడా మొదలైపోయాయని అంటున్నారు. నయనతారతో పాటు మరో కథానాయిక పాత్ర కావొచ్చని అనుకుంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం వుంది.