జూబ్లీహిల్స్ పోలీసులపై రెచ్చిపోతూ రాళ్లు రువ్విన యువతి... వీడియో చూడండి!
- గత వారాంతంలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు
- స్నేహితుడు దొరికిపోవడంతో రెచ్చిపోయిన యువతి
- వీడియో తీస్తున్నారని తిడుతూ రాళ్లు విసిరిన వైనం
పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో పాటు రోడ్డుపై దొరికిన రాయిని తీసుకుని మీడియా ప్రతినిధులపై విసిరి కొట్టింది. తన బాయ్ ఫ్రెండ్ ను ఎందుకు ఆపారని కేకలు పెట్టింది. రాయడానికి వీలులేని విధంగా తిడుతున్న ఆమెను ట్రాఫిక్ పోలీసులు అదుపు చేయలేక శాంతి భద్రతల పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆపై మహిళా పోలీసుల సాయంతో ఆమెను, ఆమె ఫ్రెండ్ నూ జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు. ఆ వీడియోను మీరూ చూడండి.