సామాజిక మాధ్యమాల్లో రజనీని దాటేసిన కమల్!

  • సామాజిక మాధ్యమాల్లో రజనీని మించిన కమల్
  • ‘ఫేస్ బుక్’ లో కమల్ ని లైక్ చేస్తున్న 35.93 లక్షల మంది
  • ‘ట్విట్టర్’లో  46.95 లక్షల మంది ఫాలో అవుతున్నారు
ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న అగ్రనటులు రజనీ కాంత్, కమల హాసన్ కు సామాజిక మాధ్యమాల్లోనూ ఫాలోవర్ల సంఖ్య బాగానే ఉన్నారు. అయితే, ట్విట్టర్ లో, ఫేస్ బుక్ ఖాతాల్లో రజనీకాంత్ కంటే కమల్ ని అనుసరించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ట్విట్టర్ లో రజనీకాంత్ ను 46.15 లక్షల మంది ఫాలో అవుతుండగా, కమల్ ను 46.95 లక్షల మంది అనుసరిస్తున్నారు. ఇక, ఫేస్ బుక్ లో అయితే రజనీని 1.75 లక్షల మంది లైక్ చేయగా, కమల్ ని 35.93 లక్షల మంది ఇష్టపడుతున్నారు. కాగా, ట్విట్టర్ ద్వారా కమల్ ఎక్కువగా ట్వీట్ చేస్తూ ఉంటారు. కమల్ తో పోలిస్తే రజనీ ట్వీట్ చేయడం తక్కువనే చెప్పొచ్చు.
Go Back to Shorts
Kamal Haasan
rajani kanth

More Telugu News