మాజీ డీజీపీ దినేష్ రెడ్డి బుల్లెట్ ప్రూఫ్ కారుకు స్వల్ప ప్రమాదం

మాజీ డీజీపీ దినేష్ రెడ్డి  బుల్లట్ ప్రూఫ్ కారుకు స్వల్ప ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ లోని మాదాపూర్ నుంచి జూబ్లీహిల్స్ వైపు వెళుతున్న ఆయన కారు పెద్దమ్మదేవాలయం వద్దకు రాగానే పక్క నుంచి వెళుతున్న ఆర్టీసీ బస్సు రాసుకుంటూ వెళ్లింది. దీంతో, కారు స్వల్పంగా దెబ్బతింది. ఆ వాహనం నుంచి దిగిపోయిన దినేష్ రెడ్డి వేరే వాహనంలో ఇంటికి వెళ్లిపోయారు. నిన్న జరిగిన ఈ సంఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రెండు వాహనాలను స్టేషన్ తరలించారు.


More Telugu News