ముంబైలో పవన్ కల్యాణ్ ఎవరో తెలియనివాళ్లకూ శ్రీరెడ్డి తెలిసింది: దర్శకుడు వర్మ

  • నటి శ్రీరెడ్డి జాతీయ సెలెబ్రెటీ అయిపోయింది
  • శ్రీరెడ్డి గురించే మాట్లాడుకుంటున్నారు
  • ఓ ట్వీట్ చేసిన రామ్ గోపాల్ వర్మ
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) తనకు సభ్యత్వం ఇవ్వకపోడంపై నటి శ్రీరెడ్డి అర్ధనగ్నంగా నిరసన వ్యక్తం చేసిన సంఘటనపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ‘శ్రీరెడ్డి జాతీయ సెలెబ్రెటీ అయిపోయింది. పవన్ కల్యాణ్ అంటే ఎవరో కూడా తెలియని కొందరు ముంబై వాసులు కూడా శ్రీరెడ్డి గురించి మాట్లాడుకుంటున్నారు’ అని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. కాగా, హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ వద్ద అర్ధనగ్న ప్రదర్శనకు దిగిన శ్రీరెడ్డి కథనాన్ని ప్రముఖ ఆంగ్లపత్రికలు కూడా ప్రచురించాయి.
Go Back to Shorts
Pawan Kalyan
ram gopal varma
sri reddy

More Telugu News