నలుగురు హీరోయిన్లలో ఒకరైన ప్రియా వారియర్... మెయిన్ హీరోయిన్ అయిపోయింది... 'ఒరు అదార్ లవ్' రీషూట్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నలుగురు హీరోయిన్లలో ఒకరైన ప్రియా వారియర్... మెయిన్ హీరోయిన్ అయిపోయింది... 'ఒరు అదార్ లవ్' రీషూట్!

  • యువత మదిని దోచిన ప్రియా వారియర్ హావభావాలు
  • ఆమె పాత్ర నిడివిని మరింతగా పెంచనున్న నిర్మాతలు
  • నాలుగు నెలల తరువాత సినిమా విడుదల
'ఒరు అదార్ లవ్' ఓ చిన్న మలయాళ చిత్రం. ఆ సినిమాలో నలుగురు హీరోయిన్లు. అందులో ఒకరు ప్రియా వారియర్. ఓ పాటలో ఆమె చూపిన హావభావాలు దేశవ్యాప్తంగా యువత మదిని దోచేయగా, రాత్రికి రాత్రే ప్రియ పాప్యులర్ అయిపోయిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ సినిమాలో ఆమె పాత్ర 15 నుంచి 20 నిమిషాల పాటు మాత్రమే తెరపై కనిపిస్తుందట. కానీ, ప్రియకు వచ్చిన పాప్యులారిటీ, దేశవ్యాప్త గుర్తింపు, వివిధ భాషల్లో డబ్బింగ్ హక్కుల కోసం నెలకొన్న పోటీని దృష్టిలో పెట్టుకుని చిత్రంలో ఆమెను ప్రధాన హీరోయిన్ గా చూపుతూ మరిన్ని సన్నివేశాలు, ప్రేమ గీతాలు చేర్చి రీ షూట్ చేయాలని నిర్మాతలు భావించినట్టు తెలుస్తోంది. చిత్రంలోని 40 శాతం భాగాన్ని రీషూట్ చేయనున్నట్టు చిత్ర యూనిట్ కన్ఫామ్ చేసింది. మరో నాలుగు నెలల తరువాతే సినిమా విడుదల ఉంటుందని స్పష్టం చేసింది. ప్రియా వారియర్ కు ఉన్న క్రేజ్ ను మరింత క్యాష్ చేసుకోవాలని నిర్మాతలు భావించినందు వల్లే, కథను కాస్తంత మార్చి సినిమాను రీషూట్ చేయాలని నిర్ణయించుకున్నారట.
Oru Adar Love
Malayalam
Priya Warior
Re shoot

More Telugu News