టీడీపీ కూడా మిమ్మల్ని నమ్మలేదు.. మీరా మాట్లాడేది?: మాయావతి
- అసహ్యమైన మాటలు, చులకన చేసే వ్యాఖ్యలతో నవ భారత్ ను నిర్మిస్తారా?
- మీ అహంకారంతో మీకు ఒక్కొక్క పార్టీ దూరమవుతోంది
- మీ మిత్రపక్షం టీడీపీ.. ఏకంగా అవిశ్వాసమే పెట్టింది
అసహ్యమైన మాటలు, ఇతరులను చులకన చేసే వ్యాఖ్యలతో దేశాన్ని నిర్మిస్తారా? ఇదేనా మీరు చెప్పే నవ భారతం? అంటూ లేఖలో అమిత్ షాను మాయావతి కడిగిపారేశారు. దేశంలో అధికారంలో ఉన్న పార్టీకి ఇలాంటివి గౌరవాన్ని ఇస్తాయా? అని ప్రశ్నించారు. బీజేపీ నేతలకు ఉన్న అహంకారం, అతి విశ్వాసం కారణంగా... మిత్రపక్షాలన్నీ ఒక్కొక్కటిగా దూరమవుతున్నాయని... బీజేపీ ఇప్పుడు ఒంటరి అయిందని అన్నారు. ఏపీకి ఇచ్చిన హామీలను కూడా మీరు నెరవేర్చలేక పోయారని... దీంతో, మీకు ఎప్పట్నుంచో మిత్రపక్షంగా ఉన్న టీడీపీ... ఏకంగా మీపై అవిశ్వాసమే పెట్టిందని ఎద్దేవా చేశారు.