టీడీపీ ఎంపీ మురళీమోహన్ కు అస్వస్థత

  • పార్లమెంట్ లో స్పృహ తప్పి పడిపోయిన మురళీమోహన్
  • అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలింపు
  • పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద కొనసాగుతున్న టీడీపీ నేతల నిరసన
ఏపీకి న్యాయం చేయాలని పోరాడుతున్న టీడీపీ ఎంపీలను లోక్ సభ స్పీకర్ ఛాంబర్ నుంచి మార్షల్స్ బలవంతంగా బయటకు తీసుకొచ్చారు. ఈ సమయంలో టీడీపీ ఎంపీలకు, మార్షల్స్ కు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఎంపీ మురళీమోహన్ అస్వస్థతకు గురయ్యారు. స్పృహ తప్పిపడిపోయిన ఆయన్ని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ఏ ఆసుపత్రికి ఆయన్ని తరలించారనే విషయం తెలియాల్సి ఉంది.

కాగా, స్పీకర్ కార్యాలయం నుంచి టీడీపీ ఎంపీలను మార్షల్స్ బలవంతంగా బయటకు తీసుకురావడంతో, పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద తెలుగుదేశం నేతలు తమ నిరసన తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ టీడీపీ ఎంపీల నినాదాలు మార్మోగుతున్నాయి.
Go Back to Shorts
Telugudesam
mp murali mohan

More Telugu News