Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాలీవుడ్ మాజీ ప్రేమికుల డ్యాన్స్ సందడి..!

  • గతంలో ప్రేమించుకున్న రణ్ బీర్ కపూర్, దీపికా పదుకునే
  • సామరస్య పూర్వకంగా విడిపోయిన ప్రేమ జంట
  • గెలాక్సీ ఆఫ్ స్టార్స్ కార్యక్రమంలో ఆటాపాట
బాలీవుడ్ మాజీ ప్రేమ జంట రణ్‌ బీర్‌ కపూర్‌, దీపిక పదుకునే సుదీర్ఘ కాలం తరువాత ఆడిపాడడం వారి అభిమానులను ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో వారి డ్యాన్స్ కు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. ముంబైలో ఏషియన్‌ పెయింట్స్‌ నిర్వహించిన ‘గెలాక్సీ ఆఫ్ స్టార్స్‌’ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఈ సన్నివేశం చోటుచేసుకుంది.

వీరిద్దరూ కలిసి నటించిన ‘యే జవానీ హై దివానీ’, ‘తమాషా’ సినిమాల్లోని పాటలతో పాటు దీపిక నటించిన ‘చెన్నై ఎక్స్‌ ప్రెస్‌’, రణ్ బీర్ నటించిన ‘యే దిల్‌ హై ముష్కిల్‌’ వంటి సినిమాల్లోని పాటలకు కూడా డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలను రణ్‌ బీర్ ఫ్యాన్‌ యూనివర్స్ ఇన్‌ స్టాగ్రామ్‌ లో పోస్ట్‌ చేయగా, వారి అభిమానులు షేర్ చేసుకుంటూ వైరల్ చేశారు. కాగా, వీరిద్దరూ గతంలో ప్రేమించుకుని, కొన్నాళ్లకు సామరస్య పూర్వకంగా విడిపోయిన సంగతి తెలిసిందే. త్వరలో దీపికా పదుకునే.. రణ్ వీర్ సింగ్ ను వివాహం చేసుకోనుందంటూ వార్తలు వెలువడుతున్నాయి.
ranbir kapoor
Deepika Padukone
Bollywood

More Telugu News