ఐవైఆర్ లాంటి దుష్టశక్తులను తరిమికొట్టాలి : వర్ల రామయ్య
- ‘ప్రజా రాజధానిపై కుట్ర’ పుస్తకాన్ని ఆవిష్కరించిన వర్ల
- ఇద్దరు అవినీతిపరుల కబంధ హస్తాల్లో ఐవైఆర్ చిక్కుకుపోయారు
- పవన్ కల్యాణ్ పరిపక్వతలేని చిన్నపిల్లోడు
ఇద్దరు అవినీతిపరుల కబంధ హస్తాల్లో ఐవైఆర్ చిక్కుకుపోయారని, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పరిపక్వతలేని చిన్నపిల్లోడని విమర్శించారు. సీఎం చంద్రబాబు కష్టపడి రాజధాని అమరావతిని నిర్మిస్తున్నారని, ఆయనపై నమ్మకంతో రైతులు ముప్పైమూడు వేల ఎకరాలను ఇచ్చారని అన్నారు. రైతులు త్యాగాన్ని చంద్రబాబు వృథా కానివ్వరని, రాజధానిపై ఎవరు కుట్రలు చేసినా తిప్పికొడతామని హెచ్చరించారు.