Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమేజాన్, ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్లపై కేంద్రానికి యాపిల్, నోకియా, లెనోవో ఫిర్యాదు

  • భారీ తగ్గింపులు ఇస్తూ నిబంధనలకు పాతరేస్తున్నాయి
  • వీటి కారణంగా 6 లక్షల ఉద్యోగాలకు ముప్పు
  • వీటిపై చర్యలు తీసుకోవాలని సెల్యులర్ అసోసియేషన్ డిమాండ్
ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు అమేజాన్, ఫ్లిప్ కార్ట్ మొబైల్ ఫోన్లపై ఇష్టారీతిగా డిస్కౌంట్లు ఇస్తున్నాయంటూ ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థలు కేంద్రానికి ఫిర్యాదు చేశాయి. ఫోన్ల తయారీ సంఘం ‘ఇండియన్ సెల్యులర్ అసోసియేషన్’ ఈ విషయాన్ని కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి సురేష్ ప్రభు దృష్టికి తీసుకెళ్లాయి. ఈ సంస్థ మొబైల్ ఫోన్లు, ఇతర ఉత్పత్తులపై మధ్యవర్తుల ద్వారా, భాగస్వామ్య కంపెనీల ద్వారా డిస్కౌంట్లను ఆఫర్ చేస్తూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఉల్లంఘిస్తున్నాయని ఆరోపించాయి.

తగ్గింపులు ఇవ్వడం ద్వారా ఆఫ్ లైన్ దుకాణాదారుల ఆదాయాన్ని హరించేస్తున్నాయని, 6 కోట్ల మంది ఉద్యోగాలకు ముప్పు ఏర్పడిందని ఈ సంఘం కేంద్ర మంత్రికి వివరించింది. ఎఫ్ డీఐ నిబంధనలు ఉల్లంఘించిన ఈ కామర్స్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఇండియన్ సెల్యులర్స్ అసోసియేషన్ లో యాపిల్, నోకియా, వివో, లావా, మైక్రోమ్యాక్స్, లెనోవో, మోటరోలా సభ్యత్వం కలిగి ఉన్నాయి.

అయితే, ఈ ఆరోపణలను అమేజాన్ ఇండియా ఖండించింది. భారతీయ చట్టాలకు కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేసింది. అమేజాన్ డాట్ ఇన్ లో ఉత్పత్తుల ధరలు పూర్తిగా విక్రయదారుల ఇష్టంపైనే ఉంటాయని పేర్కొంది. ఫ్లిప్ కార్ట్ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు.
flipkart
amazon

More Telugu News