జోధ్ పూర్ ఎయిర్ పోర్టులో సినీ నటి టబుకి చేదు అనుభవం!
- కృష్ణ జింకను వేటాడిన కేసు విషయంలో కోర్టుకు టబు
- నేడు తీర్పు వెలువరించనున్న కోర్టు
- జోధ్ పూర్ ఎయిర్ పోర్టులో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించిన అభిమాని
కోర్టు నేడు తీర్పు వెలువరించనున్న క్రమంలో కోర్టుకు హాజరు కావడానికి టబు జోధ్ పూర్ ఎయిర్ పోర్టుకు చేరగా, ఒక అభిమాని సెక్యూరిటీని దాటుకుని మరీ ఆమె వద్దకు వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడు. వెంటనే అక్కడ ఉన్న బౌన్సర్లు అతన్ని పక్కకు లాగిపడేశారు. దీంతో టబు చాలా ఇబ్బంది పడ్డారని, దీనిపై కేసుపెట్టే అవకాశం ఉందని మీడియా వర్గాలు చెబుతున్నాయి.