charan: ఇప్పుడు బరువు తగ్గినట్టుంది .. భారం దిగినట్టుంది: చరణ్

  • 'రంగస్థలం' కోసం గెడ్డం పెంచిన చరణ్ 
  • చాలారోజుల పాటు అదే లుక్ కొనసాగింపు  
  • తాజాగా ఆ లుక్ నుంచి బయటపడిన వైనం 
సుకుమార్ దర్శకత్వంలో చరణ్ చేసిన 'రంగస్థలం' భారీ వసూళ్లను సాధిస్తూ .. కొత్త రికార్డుల దిశగా దూసుకుపోతోంది. దాంతో చరణ్ చాలా హ్యాపీగా వున్నాడు. ఈ సినిమా కోసం చరణ్ జుట్టు .. గెడ్డం పెంచవలసి వచ్చింది. ఈ సినిమా షూటింగ్ ఎక్కువకాలం పాటు కొనసాగడం వలన, ఆయన వాటిని భరిస్తూ రావలసి వచ్చింది.

సాధారణంగా పెరిగిన క్రాఫ్ .. గెడ్డం ఎవరినైనా చికాకు పెట్టేస్తుంటాయి. వాటి భారాన్ని ఎప్పుడు వదిలించుకుందామా అని అనిపిస్తూ ఉంటుంది. అలాంటిది పెరిగిన క్రాఫ్ తో .. గెడ్డంతో చాలాకాలం పాటు ఉంటూ వచ్చిన చరణ్, ఇక రీసెంట్ గా క్రాఫ్ ను .. గెడ్డంను ట్రిమ్ చేయించాడు. ఇప్పుడు నాకు ఓ అయిదు కేజీల బరువు తగ్గినట్టుగా అనిపిస్తోందంటూ .. భారం దిగిపోవడం వలన కలిగే ఆనందాన్ని పొందుతూ .. ఉపాసనతో వున్నటువంటి ఒక ఫోటోను పోస్ట్ చేశాడు. ఇక బోయపాటి మూవీలో చరణ్ ఏ లుక్ తో కనిపిస్తాడో చూడాలి.  
charan
upasana

More Telugu News