Special Category Status: ప్రత్యేక హోదా ఉద్యమ కార్యాచరణపై చర్చించిన పవన్ కల్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదా, విభజన హామీలపై పోరాటానికి సిద్ధమవుతున్నారు. వామపక్ష నేతలతో కలిసి పోరాటానికి ఆయన ప్రణాళిక వేస్తున్నారు. విజయవాడలోని జనసేన కార్యాలయంలో వామపక్ష నేతలతో పవన్ కల్యాణ్ సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఉద్యమ కార్యాచరణపై సీపీఐ, సీపీఎం నేతలు రామకృష్ణ, మధు తదితరులు పవన్ కల్యాణ్‌కి వివరించి చెప్పారు.
తాము తీసుకున్న నిర్ణయాన్ని కాసేపట్లో జనసేన అధినేత మీడియాకు వివరించే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రత్యేక హోదాపై టీడీపీ, వైసీపీ పోరాడుతోన్న విషయం తెలిసిందే. తమ పోరాటంపై వామపక్ష పార్టీలతో కలిసి పవన్ కల్యాణ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్న ఆసక్తి నెలకొంది.