Narendra Modi: ప్రధాని మోదీపై 420 కేసు పెట్టాం: రఘువీరారెడ్డి

  • స్పీకర్ సుమిత్ర ఆమె హక్కులను బీజేపీకి తాకట్టు పెట్టారు
  • సమాధానాలు చెప్పకుండా మోదీ పారిపోతున్నారు
  • హోదా ఇస్తారో, లేదో స్పష్టం చేయాలి
ప్రధాని నరేంద్ర మోదీ, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ లపై ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శలు గుప్పించారు. లోక్ సభలో తనకున్న హక్కులను స్పీకర్ సుమిత్ర బీజేపీకి తాకట్టు పెట్టారని ఆయన అన్నారు. దేశంలో బీజేపీ ఒంటరి అవుతోందని చెప్పారు. విపక్షాల ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా ప్రధాని నరేంద్ర మోదీ పారిపోతున్నారని ఎద్దేవా చేశారు.

ఏపీ ప్రజలను దారుణంగా మోసం చేసినందుకు మోదీపై 420 కేసు పెట్టామని తెలిపారు. ప్రత్యేక హోదాపై ఉద్యమాలు చేసిన తమను టీడీపీ ప్రభుత్వం జైల్లో పెట్టిందని మండిపడ్డారు. ఈ నెల 6వ తేదీ లోగా ప్రత్యేక హోదాను ఇస్తారో, లేదో స్పష్టం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. 
Narendra Modi
sumitra mahajan
raghuveera reddy
special status

More Telugu News